అలై పొంగెరా… పార్ట్-1

శ్రావణ మాసం ఆగస్ట్ నెల ,ఆడవాళ్లంత పూజలు వ్రతాలు చేసుకునే సమయం. సెలవులు అప్పుడే పూర్తయ్యయా అనుకుంటూ ఊసూరుమంటూ కాలేజ్ కి వెళ్తున్న స్టూడెంట్స్ (వీళ్ళంతా సీనియర్స్) ,జూనియర్స్ ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్న రోజులు.
నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్ ఆవరణమంత నందనవనంలా న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చిన స్టూడెంట్స్ తో నిండిపోయింది. ఒక గీత రచయిత రాసాడు
“ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు
ఏడనించో  గోరు వంకలు
కాలేజ్ క్యాంపస్ లోనే నాట్యం చేసేనే

కన్నేపిల్ళెల కొంటె నవ్వులూ
కుర్ర మనసుల కౌగిలింతలూ
కాలేజ్ కాంపౌండ్ అంటే కొడైకెనాలే “

చూస్తుంటే నిజమే అనిపిస్తుంది,ఇప్పుడు చూస్తే ఇంకేమి రాస్తాడో..

అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని కొంచెం తెలిసి తెలియక,ఏర్పడి ఏర్పడని వ్యక్తిత్వంతో, ప్రపంచాన్ని జయించేద్దామనే తపన   కనపడుతుంది ఆ కళ్ళలో. ఎన్నెనో చిట్టి గువ్వలు ,గోరు వంకలతో బృందావనం లా ఉంది.

నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్  సిటీ మద్యలో నారాయణగూడ లో ఉంటుంది,చాలా మంది కౌన్సిలింగ్ కి వెళ్ళిన వాళ్ళు కాలేజ్ లోకేషన్ చూసి సెలెక్ట్ చేసుకుంటారంటే నంమ్మశక్యం కాదు. ఇక్కడి నుండి సిటీ లో ని ఏ ప్లేస్ కి అయిన తొందరగా వెళ్ళవచ్చు.  ఈ కాలేజ్ కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, కాలేజ్ ఆవరణంలో హాస్టల్ కూడా ఉంటుంది. పెద్ద ఎంట్రెన్స్ తో ఎంటర్ అవగానే విశాల ప్రాంగణం చెట్లతోనిండి ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తుంటుంది. కుడి ప్రక్కకు MCA కాలేజ్ ,సూటిగా వెళ్తే MBA కాలేజ్ వీటికి అర మైలు దూరంలో హాస్టల్ లొకేట్ చేయబడి ఉంటుంది.

కాలేజ్ జీవితం ప్రతి మనిషికి గుర్తుండిపోయే అందమైన అనుభవం. 20 ఏళ్ల వయసులోని ఈ అనుభవాలు 60 ఏళ్ల వయసులో నెమారేసుకోడానికి అనుభూతులను మిగిలుస్తాయి. రాగ్ చేసి స్నేహితులయ్యే సీనియర్స్,కాలేజ్ కొత్తలో బెరుకు చూపులు,చేయి చాచి స్నేహం కోరిన స్నేహితులు,క్యాంటీన్ లో కబుర్లు,న్యూ మూవీ రిలీజ్ రోజు కాలేజ్ బంకులు,క్లాస్ లో అల్లర్లు,లెక్చరర్ తో తిట్లు, క్లాస్ బోర్ కొడితే చెట్ల కింద నివాసాలు,సంవత్సరమంతా  మొహం చూడని లైబ్రరీ (పరీక్ష టైమ్ లో తప్ప),ఖాళీ జేబులు,1/2 టీ,బిర్యానీ పార్టీ లు, అమ్మాయిల ఓర చూపులు,తొలిప్రేమలు,నచ్చిన అమ్మాయిని మెప్పించడానికి పడే పాట్ల్,చిన్ని గొడవలు,ఆన్యూవల్ పార్టీ సొద,ఫ్రెషర్స్ పార్టీ రోజు ఆనందం ,టెన్షన్ పెట్టె సెమిస్టెర్ పరీక్షలు,స్నేహితులతో విహార యాత్రలు , సంతోషాన్ని, దుఖాన్ని రెండు తీసుకు వచ్చే ఫలితాలు, ఫలితాల పార్టీ లు, ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టె ఫేర్‌వెల్ పార్టీ ,ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగే రంగుల హరివిల్లు.

ఇవన్ని మరిచిపోగలమా, మళ్లీ వెనక్కి ఆ రోజులకీ వెళ్తే బావుండునని ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైన అనుకుంటాడు.
అడ్మిషన్ కౌంటర్ దగ్గర కొలాహాలంగా ఉంది. నుదుటి మీద పడిన ముంగురులను సవరించుకుంటూ చూశాను కౌంటర్ వైపు.
“పేరు”
“ఆముక్త”
“MCA అడ్మిషన్?”
“అవును”
“ఫిల్ దిస్ ఫామ్”
“సర్ పూర్తి చేశాను”అంటూ ఫిల్ చేసిన ఫాం ని ముందుకు చాచాను .
“ఇక్కడ సంతకం చెయమ్మ”
“ఓకె సర్”
“ఫార్‌మ్యాలిటీస్ అన్ని పూర్తి అయ్యాయి నువ్వికా క్లాస్ కి వెళ్ళవచ్చు.”
ఓకే అంటూ ముందుకు కదిలాను,

కళ్ళలో ప్రపంచాన్ని జయించాలనే తపన, ఆత్మవిశ్వాసం,కొంచెం భయం లక్ష్యాన్ని సాధించగలనో లెనొనని ..ఊహు ఏమీ కాదు సాదించాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదూ..నేను ఆముక్త, సగటు మద్య తరగతి అమ్మాయిని.  ఇది నా కథ.

Posted in ఆలై పొంగెరా... | 4 Comments

అలై పొంగెరా…

 ఈ కథ నా జీవితం. ఇలాంటివి చాలా చూశామనీ అనుకుంటున్నారు కదా , నా ఈ కథ అందులో విభిన్నమైనదని నాకు అనిపిస్తుంది. మీకు ఏమీ అనిపిస్తుందో చదివి చెప్పరు.

Posted in ఆలై పొంగెరా... | 1 Comment

ప్రియసఖి

నీలి మబ్బుల్లోని చంద్రమా..మంచు వెన్నెల్లోని సంద్రమా …

విరిసిన  పువ్వుల మధువనమా …అరవిరిసిన వసంతమా..

మరుమల్లెల సుగంధమా ..నీ నవ్వుల్లో జాలువారిన ముత్యాల విలువేమి ..

నీ సొగసుల చూడ నా నయనాలు చేసుకున్న అదృష్టమేమి…

Posted in కవిత్వం | Leave a comment

పున్నమి చంద్రుడు

ఉషోదయవేళ భానుడి కిరణాలవోలె నీ చూపులు..

ఏటి గట్టున సముద్రుడి శాంతమువోలె నీ మనసు..

వటవ్రుక్షమువోలె అక్కన చేర్చుకొని సేద తీర్చె నీ సాన్నిధ్యం..

గుడిలోని దైవమువోలె నీలో స్థిరచిత్తం..అందరు మైమరిచి చూస్తున్న..

రగిలే మంటలు,కదలాడే బావనలు నీలో దాచి చిద్విలాసంగా నవ్వుతున్నావు పున్నమి చంద్రుడిలా..

Posted in కవిత్వం | Leave a comment

చిన్ని మనసా

కదలవే కాలమా వడి వడిగా,నను నా ప్రియుని చెంత చేర్చ..

వెల్లిపో చంద్రమా,నా సఖుడు లేని వేళ నీకేది చోటిక్కడ..

వేగి రమ్ము రవికిరణమా,గగన చీకటి చెర తొలిగించి వేకువ రేకులు విచ్చుకొనగా..

నిదురించవే చిన్ని మనసా,ఏల చింత నీ నాథుడు నీలొ కొలవై ఉండగా..

Posted in కవిత్వం | Leave a comment

నీది ప్రేమా?పగా?

నువ్వంటే ఇష్టమంటూనే వేదనకు గురి చేస్తావు..

నువ్వంటే ప్రాణమంటూనే చిత్రవధ చేస్తావు..

నీకై మనసులో గుడి కట్టానంటూనే కర్కశంగా వేదిస్తావు..

నీది ప్రేమా?పగా?ఎవరివి నీవు చెలివా??రాక్షసివా?..

నువ్వంటే ప్రెమంటూ వలపిస్తావు..

నీ తోడై నేనున్నానంటూనే నడి సముద్రంలో వదిలేస్తావు..

నీది ప్రేమా?పగా?ఎవరివి నీవు చెలివా??రాక్షసివా?..

Posted in కవిత్వం | Leave a comment

అర్థాంగి

నా కనులు కోరిన మధుర స్వప్నానివి..

నా మనసుపాడే సంగీతంలో స రి గ మ వి..

నా ఊహలకు ఆక్రుతినిచ్చిన అపురూప శిల్పానివి..

నను వలచి వలిపిం చుకొని మనువాడిన కొమలాంగివి..

మనసెరిగి నాలో సగమైన నా అర్థాంగివి

Posted in కవిత్వం | Leave a comment