నిగ్గడీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవాశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరూ ఎమైపొని
గాలీవాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రె దాటు మందకి నీ జ్ణానబోధ దేనికి
ఏచరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏక్షణానా మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కుర్క్షేత్రం –నిగ్గడీసి–
పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా..
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే కధే అంతా..
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ…
ఇప్పటి మన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది ఈ పాట ఆలోచించండి.. మన కర్తవ్యం ఏంటో….మనం ఎంచుకున్న దారి మనల్ని ఎటు తీసుకెళుతుందో.. సమస్యలను అంతం చేయాల్సిన పాలకులే సృష్టిస్టుంటే… ఇంతకు ముందు కుల , వర్గ రాజకీయాలు ఇప్పుడు ప్రాంత రాజకీయాలు మొదలుపెట్టారు.. సామాన్యుడి నడ్డి వీరుస్తున్నా ధరల ఊసెవ్వరికి పట్టదు.. నగరం నడి బొడ్డు న పంజా విసురుతున్న ఉగ్రవాదం ఎవరికి పట్టదు.. వర్షాభావ పరిస్థితులకు, ప్రకృతి విలయాలకు బలి అవుతున్న రైతన్న ఎవరికి పట్టదు.. మరి ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు,ఎందుకోసం ఈ నాయకులు.. వీరిని గుడ్డిగా నమ్ముతున్న మన పయనమెటు .. వాళ్ళాడుతున్న ఈ రాక్షసక్రీడ కి బలవుతున్న మన మనుగడేమిటి… ఆలోచించండి…ఒక్కసారి..
Timely post….