తెలుగు సినిమా జగత్తులో వేటూరి గారి మరణంతో ఒక శకం ముగిసింది… ఆయన పాటలు వింటూ పెరిగాను.. వేటూరి పద శైలి ని పద కవిత పితామహుడు అన్నమాచార్యునితో పోల్చవచ్చని శంకరాభరణం, సాగర సంగమం పాటలు వింటున్నప్పుడల్లా అనిపించేది.. “దొరకునా ఇటువంటి సేవ …దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు నిర్వాన సోపాన మదిరోహణము సెయుత్రొవ” ఈ లిరిక్స్ విన్నప్పుడు మనసు ఏదో అవ్యక్తమైన భావాలకు లోనవుతుంది. ” మాటే మంత్రం మనసే మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము” అని ఆయన రాసిన ఈ పాట ఎన్ని ప్రేమ మనసులను సృశించిందో..”సామజవరగమన……” జీవితములో ఒక్కసారన్న సంగీత ప్రియులు పాడాలనుకునేది. “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…” ప్రతి శ్రీమతి వాళ్ళ శ్రీవారిని ఊహించుకొని మనసులో పాడేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి…” ఇప్పటికీ కుర్రకారును ఊర్రూతలూగించే పాట,ఇలా ఎన్నో ఎన్నెన్నో. దేవుడికి నివేదన, అల్లరి పాటలు, మనసును తట్టే ప్రేమ గీతాలు, సున్నితంగా జీవిత సత్యాలను చెప్పేవి ఎన్నో ఎన్నెన్నో. మా తరానికి తరగని సంగీత ఆస్తులని ఇచ్చి ఇక సెలవని వెడిలిన పాటల తోటమాలికి ఇదే మా అశ్రు నివాళి…
-
కొత్త సాహిత్యం
Categories
-
విమర్శలు / పొగడ్తలు
padmarpita on ఆలోచించండి…ఒక్కసారి.. Kishen Reddy on ఆలై పొంగెరా…పార్ట్-… మాలతి on వర్షం….మా ఇంటి నుండి బంగ… chinnu on ఆలై పొంగెరా పార్ట్-3 chinnu on వర్షం….మా ఇంటి నుండి బంగ… ఇష్టమైన బ్లాగులు
- Poorna's మనసైన బ్లాగ్ 0
-
Blog Stats
- 1,625 hits