వర్షం కురుస్తుంది ధరిత్రి ధాహం తీర్చడానికి ,ప్రశాంత సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ..
నిశ్చలంగా ఉండే బంగాళాఖాతం హోరెత్తుతుంది వర్షం చినుకులను తనలో కలుపుకుని,ఉవ్వెత్తున్న ఉప్పొంగుతున్న అలలను చూస్తూ …
అలలు ఎగిసి పడుతున్నాయి ఆకాశాన్ని అందుకోవాలనో లేక ప్రళయమై తీర ప్రాంతాన్ని ముంచేసెద్డామనో..
నిర్మలంగా ఉన్న ఆకాశం నవ్వుతుంది తనను అందుకోవాలని అలలు పడే తాపత్రయాన్ని చూసి…
నా మనసు మురుస్తుంది చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ…
ఎడ తెగని ఈ వర్షం ఎందరికి సంతోషాన్ని పంచుతుందో,ఎన్ని జీవితాలలో చీకటి నింపబోతుందో ఎందరి ఆశలను ఆడియాసాలు చేయబోతుందో ఎవరికి ఎరుక.. ఒక్క వర్షానికి తప్ప…..
Advertisement
baaga rastunnaru
thanks anand….
నా మనసు మురుస్తుంది చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ… — బంగాళాఖాతం హోరూ, ఎవరిఆశలు ఆడియాసలుచేస్తుందోనన్న ఆందోళనలూ – వీటిమధ్య మీ మనసు మురిసిపోవడం అసాధారణమయిన కాన్సెప్ట్. చక్కగా రాసేరు. చిన్నకవితలా ఉంది. అభినందనలు. మీకు నాకథ నచ్చినందుకు కూడా సంతోషం ఇక్కడే వెలుబుచ్చుకుంటాను.
- మాలతి