ఆలై పొంగెరా పార్ట్-3

మరుసటి రోజు ఉదయం కాలేజ్ ఆవరణం లో అడుగు పెట్టగానే,
” ఏయ్ ఇటు రా”  అనే పిలుపు వినబడింది.
ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను, నిన్న పాట పాడమన్న అమ్మాయి.
“ఓ మై గాడ్” ప్రోద్డునే ఈవిడకు దొరికాను ఇక నా పని గోవింద  అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాను.
“గుడ్ మార్నింగ్ మేడమ్” సీనియర్స్ కి విష్ చేయాలనే విషయం గుర్తు చేసుకుంటూ.
“పాట నేర్చుకున్నావా”
“ఎస్”
“ఐతే పాడు” come on guys ఈ అమ్మాయి పాట పాడుతుంది అంటూ ఇంకొంతమంది సీనియర్స్ ని పిలిచింది.
కాళ్ళు వణుకుతున్నాయి… గుండె దడ పెరిగింది.  ఏమె  ఆముక్త నిన్న తనకి సరిగ్గా సమాధానాలు చెప్తే సరిపోయేది కదా, బింకానికి పోయావు, చిక్కుకున్నావు..అనుభవించు నా అంతరాత్మా తిడుతుంది…నొర్ముయ్ అలా ఏమీలేదు అంటూ దాన్ని కసిరి..ధైర్యం తెచ్చుకుని పాడటానికి రెడీ అయ్యాను.
” నువ్వు నువ్వు నువ్వే నువ్వు ” అంటూ గబ గబ పాడేశాను.
“ఏయ్ ఎంటా పాడటం నేను పాట పాడమాన్నాను పద్యం  చెప్పమనలేదు”.
” నాకిలా పాడటమే వచ్చు మేడమ్”  సిన్సియర్ గా చెప్పాను అని అనుకున్నాను..టింగరగా అనిపించిందని తన మొహం చూస్తే అర్థం అయింది.
అయ్యో ఆముక్త ఏమీ చేస్తున్నావే.. కొంచెం జాగ్రతగా మాట్లడవే అంతరాత్మా మళ్లీ హెచ్చరించింది . జాగ్రత్త పడెలోపే జరగాల్సింది జరిగిపోయింది.

” సరే పాటలో నువ్వు నువ్వు ఉన్న చోట్లలో కొవ్వు కొవ్వు అని పెట్టి పాడు” అంది ఆ అమ్మాయి తన ఉక్రోషం మాటల్లో చూపిస్తూ..
“”
“ఏంటి పాడమంటే మౌనంగా నిలబడ్దావు, పాట పాడకపోతే నిన్ను ఈ రోజంతా క్లాస్ కి పంపించాను ఇక్కడే నిలబెడతా, come on ఫాస్ట్ గా పాడేసి నీ క్లాస్ కి వెళ్లిపో”  నీకు అంతకన్నా వేరే ఆప్షన్ లేదని  నవ్వుతున్న కళ్ళతో చెప్పింది.
“”
“You Know Guys ఈ అమ్మాయికి చిరాకెక్కువ, ఏమైన అంటే చాలు చిరాకుగా మొహం పెడుతుంది.”
ఐతే నా అంతరాత్మా నిజమే చెప్పింది, నిన్నటి నా ప్రవర్తన కి ఫలితం అన్నమాట. ఒక్క నిమిషం నీరసం ఆవహించింది..  పెద్ద బరువేత్తుకున్న ఫీల్..  ఒక్క నిమిషం అలోచించాను ఈవాళ లేవగానే ఎవరి మొహం చూసాన అని… ఇంకెవరిది నాదే చూసుకుని ఉంటాను..లేవగానే అద్దం ముందు నిలబడి చూసుకోవడం  అలవాటె కదా అన్న విషయం జ్ఞప్తికి వచ్చి… ఆముక్త దొరికిపోయావే….
“ఏయ్ ” అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను….
“పాడమంటే ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయావు , ఫాస్ట్ గా పాడు మాకు క్లాస్ కి టైమ్ అవుతుంది”
ఆముక్త తప్పదు కళ్ళు మూసుకొని పాడేసెయ్యవే..ఈ లంపట౦ వదిలించుకొని క్లాస్ కి వెళ్లిపోవచ్చు…
“కొవ్వు కొవ్వు…..నీ వళ్ళంతా కొవ్వు” అని పాడుదామనుకున్న.
ఆముక్త శాంతి,ఇరుక్కుంటావు అని లోపలి నుండి హెచ్చరిక వినిపించడంతోమనసులో పాడేసుకుని ఆ అమ్మాయి అడిగిన విధంగా బయటకు పాడేశాను…
“అయిపోయిందా”
“ఎస్” అంటూ బుద్డిగా తలూపాను.
“సరే క్లాస్ కి పో” అంటూ వదిలేసింది.

హమ్మయ్య అనుకుంటూ క్లాస్ కి వెళ్ళాను, అక్కడ ఇంకో సీనియర్స్ బ్యాచ్ ఉంది… సర్ ని బయటకు పంపించి మరి తిష్ట వేశారు  క్లాస్ లో..అక్కడి నుండి పారిపోవాలని ఆ క్షణం గట్టిగా అనిపించింది, ఐనా సమధానపరుచుకుంటూ కూర్చున్నాను……

Advertisement
This entry was posted in ఆలై పొంగెరా.... Bookmark the permalink.

4 Responses to ఆలై పొంగెరా పార్ట్-3

  1. Aavakaya says:

    Meeru iddaroo kalisi choosina modati movie ‘SAKHI” aa?

  2. సీనియర్ comment పెడితే Thanks చెప్పాలని తెలియదా…మొదటి post లో నా comment కి Thanks చెప్పలేదు :D

    అమ్మో అలా చూడకండి ఖోపంగా…ఏదో మీ raging కబుర్లు చదువుతుంటే అలా జోష్ వచ్చేసి జోక్ చేసా అంతే. బ్లాగుల్లో తప్పటదుగులేసే stage లోనే వున్నా, కనీసం M.C.A లో మీ senior batch అయ్యుంటాననే ధైర్యం తో అలా అనేసాను. మరీ అలా చికాగ్గా చూడకండి.

    Waiting for your next post :D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s