ఆలోచించండి…ఒక్కసారి..

నిగ్గడీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవాశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరూ ఎమైపొని

గాలీవాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రె దాటు మందకి నీ జ్ణానబోధ దేనికి
ఏచరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏక్షణానా మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కుర్క్షేత్రం –నిగ్గడీసి–

పాత రాతి గుహలు పాలరాతి గృహాలైనా..
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే కధే అంతా..
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ…

ఇప్పటి మన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది ఈ పాట ఆలోచించండి.. మన కర్తవ్యం ఏంటో….మనం ఎంచుకున్న దారి మనల్ని ఎటు తీసుకెళుతుందో..  సమస్యలను అంతం చేయాల్సిన పాలకులే సృష్టిస్టుంటే…  ఇంతకు ముందు కుల , వర్గ రాజకీయాలు ఇప్పుడు ప్రాంత రాజకీయాలు మొదలుపెట్టారు.. సామాన్యుడి నడ్డి వీరుస్తున్నా ధరల ఊసెవ్వరికి పట్టదు.. నగరం నడి బొడ్డు న పంజా విసురుతున్న ఉగ్రవాదం ఎవరికి పట్టదు.. వర్షాభావ పరిస్థితులకు, ప్రకృతి విలయాలకు బలి అవుతున్న రైతన్న ఎవరికి పట్టదు..  మరి ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు,ఎందుకోసం ఈ నాయకులు.. వీరిని గుడ్డిగా నమ్ముతున్న మన పయనమెటు .. వాళ్ళాడుతున్న ఈ రాక్షసక్రీడ కి బలవుతున్న మన మనుగడేమిటి… ఆలోచించండి…ఒక్కసారి..

Posted in ఆలోచించండి... | 1 Comment

అశ్రు నివాళి…

తెలుగు సినిమా జగత్తులో వేటూరి గారి మరణంతో ఒక శకం ముగిసింది…  ఆయన పాటలు వింటూ పెరిగాను.. వేటూరి పద శైలి ని పద కవిత పితామహుడు అన్నమాచార్యునితో పోల్చవచ్చని  శంకరాభరణం, సాగర సంగమం పాటలు వింటున్నప్పుడల్లా అనిపించేది.. “దొరకునా  ఇటువంటి సేవ …దొరకునా  ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు నిర్వాన సోపాన మదిరోహణము సెయుత్రొవ” ఈ లిరిక్స్ విన్నప్పుడు మనసు ఏదో అవ్యక్తమైన భావాలకు లోనవుతుంది.  ” మాటే మంత్రం మనసే  మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము” అని ఆయన రాసిన ఈ పాట ఎన్ని ప్రేమ మనసులను సృశించిందో..”సామజవరగమన……” జీవితములో ఒక్కసారన్న సంగీత ప్రియులు పాడాలనుకునేది. “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు…”  ప్రతి శ్రీమతి వాళ్ళ శ్రీవారిని ఊహించుకొని మనసులో పాడేసుకుంటారంటే అతిశయోక్తి కాదు. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి…” ఇప్పటికీ కుర్రకారును ఊర్రూతలూగించే పాట,ఇలా ఎన్నో ఎన్నెన్నో. దేవుడికి నివేదన, అల్లరి పాటలు, మనసును తట్టే ప్రేమ గీతాలు,  సున్నితంగా  జీవిత సత్యాలను చెప్పేవి ఎన్నో ఎన్నెన్నో. మా తరానికి తరగని సంగీత ఆస్తులని ఇచ్చి ఇక సెలవని వెడిలిన పాటల తోటమాలికి ఇదే మా అశ్రు నివాళి…

Posted in కవిత్వం | Leave a comment

ఆలై పొంగెరా…పార్ట్-4

వారం రోజుల్లోనే క్లాస్ లో బ్యాచ్ లు ఏర్పడ్డాయి. మా బ్యాచ్ మొత్తం నలుగురం గీత , స్వర్ణ, సౌజన్య,నేను..
రోజు రాగ్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెషర్స్ పార్టీ వరకు చేస్తారట. ఏరోజుకారోజు హమ్మయ్య డే కంప్లీట్ అయ్యింది తప్పించుకున్నాము అనుకునేవాళ్ళము..
సీనియర్స్ వస్తున్నారంటే ఎస్కేప్ అయ్యవాళ్ళము. ఇప్పుడు లంచ్ అవర్ , లీషర్ అవర్ కోసం wait చేసి వస్తున్నారు మమ్మల్నీ రాగ్ చేయడానికి.

ఆ రోజు  లీషర్ అవర్..క్లాస్ వాళ్ళంతా క్యాంటీన్ కి వెళ్లారు,,క్లాస్ లో ముగ్గురం మిగిలాము. ఇద్దరు సీనియర్స్ క్లాస్ లో కి ఎంటర్ అయ్యారు..
వచ్చి కూర్చొని మిగిలిన ఇద్దరు అమ్మాయీలతో చిట్ చాట్ చేస్తున్నారు. ఇంతలో ఒకతను నా వైపు చూసి
“హేయ్ ఆముక్త ఏమీ చేస్తునావు?”
“Nothing సర్ చెప్పండి” అన్నాను చదువుతున్న్న బుక్ ని మూసెస్తూ.
“హౌ ఇస్ కాలేజ్ అండ్ ఆల్”
“గుడ్”
“you want to know anything about the college”
ఒక నిమిషం ఏమీ అడగాలో అర్థం కాలేదు.. వీళ్ళని ఏమీ అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు అంటూ ఆలోచనలో పడిపోయాను.
“హేయ్ come on ask anything, i will answer “
“సర్ మీ క్లాస్ టాపర్ ఎవరు?” ఏమీ మాట్లాడాలో తెలియక casual గా అడిగాను. అలా అడగడం కూడా తప్పెనని తరువాత తెలిసింది….
అతను నవ్వేసి ఊరుకున్నాడు..
ఇదంతా దూరంగా కూర్చుని వింటున్నా ఇంకొక అతను మాకు దగ్గరగా వచ్చి..
“చెప్ప రా మన క్లాస్ టాపర్ ఎవరో ” అంతటితో ఊర్కోకుండా “ఈ year వీళ్ళ క్లాస్ టాపర్ ఈ అమ్మాయే యూ నో” అంటూ పగలబడి నవ్వాడు.  నాకర్థం అవ్వలేదు అందులో అతను ఎగతాళి చేయాల్సిన విషయం ఏముందనేది.
“ఏమీ ఎందుకు ” అని అడిగాడు నేను అడిగిన అతను.
“జస్ట్ తెల్సుకుందామని”
ఛా అనవసరంగా అడిగానే వీళ్ళని ,అయిన తప్పుగా ఏమీ అడగలేదే.. మాట్లాడకుండా ఊరుకోవాల్సింది.. తప్పు చేశాను… ఏంటి ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను  లైట్ అనుకుంటూ క్యాంటీన్ లో టీ తాగడానికి బయలుదేరాను.

క్లాస్ ఎంట్రెన్స్ దగ్గర వీళ్ళిద్దరితో పాటు ఇంకో ముగ్గురు సీనియర్స్ జత కూడి అడ్డంగా నిలుచున్నారు.

“Excuse me Sir”
” హేయ్ జరగండ్ర సౌజన్య వెళుతుందట” అన్నాడు ఇంతకు ముందు ఎగతాళి గా మాట్లాడిన అతను.
” సర్ నా పేరు సౌజన్య కాదు ఆముక్త..first నా పేరు కరెక్ట్ గా చెప్పండి” మెల్లగా నవ్వుతూ చెప్పాను.
అతనికి నా సమాధానం లో వెటకారం బాగా తగిలిందని next తను రియాక్ట్ అయిన తీరు చూస్తే అర్థం అయింది
“ఏయ్ next వీళ్ళ క్లాస్ టాపర్ ఈ అమ్మాయే తెలుసా”  అని టిట్ ఫోర్ టాట్ అన్నట్టు చూసాడు నా వైపు.
ఒరగా చూసాను. అందరు నవ్వుతున్నారు. ఆరోజే నిర్ణయించుకున్నాను క్లాస్ టాప్ చేయాలని.

Posted in ఆలై పొంగెరా... | 1 Comment

వర్షం….మా ఇంటి నుండి బంగాళాఖాతాన్ని చూస్తున్నపుడు కలిగిన ఊహ….

వర్షం కురుస్తుంది ధరిత్రి  ధాహం తీర్చడానికి ,ప్రశాంత సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ..
నిశ్చలంగా ఉండే బంగాళాఖాతం హోరెత్తుతుంది వర్షం చినుకులను తనలో కలుపుకుని,ఉవ్వెత్తున్న ఉప్పొంగుతున్న అలలను చూస్తూ …
అలలు  ఎగిసి పడుతున్నాయి ఆకాశాన్ని అందుకోవాలనో లేక ప్రళయమై తీర ప్రాంతాన్ని ముంచేసెద్డామనో..
నిర్మలంగా ఉన్న ఆకాశం నవ్వుతుంది తనను అందుకోవాలని అలలు పడే తాపత్రయాన్ని చూసి…
నా మనసు మురుస్తుంది చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ…
ఎడ తెగని ఈ వర్షం ఎందరికి సంతోషాన్ని పంచుతుందో,ఎన్ని జీవితాలలో చీకటి నింపబోతుందో ఎందరి ఆశలను ఆడియాసాలు చేయబోతుందో ఎవరికి ఎరుక.. ఒక్క వర్షానికి తప్ప…..

Posted in కవిత్వం | 3 Comments

ఆలై పొంగెరా పార్ట్-3

మరుసటి రోజు ఉదయం కాలేజ్ ఆవరణం లో అడుగు పెట్టగానే,
” ఏయ్ ఇటు రా”  అనే పిలుపు వినబడింది.
ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను, నిన్న పాట పాడమన్న అమ్మాయి.
“ఓ మై గాడ్” ప్రోద్డునే ఈవిడకు దొరికాను ఇక నా పని గోవింద  అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాను.
“గుడ్ మార్నింగ్ మేడమ్” సీనియర్స్ కి విష్ చేయాలనే విషయం గుర్తు చేసుకుంటూ.
“పాట నేర్చుకున్నావా”
“ఎస్”
“ఐతే పాడు” come on guys ఈ అమ్మాయి పాట పాడుతుంది అంటూ ఇంకొంతమంది సీనియర్స్ ని పిలిచింది.
కాళ్ళు వణుకుతున్నాయి… గుండె దడ పెరిగింది.  ఏమె  ఆముక్త నిన్న తనకి సరిగ్గా సమాధానాలు చెప్తే సరిపోయేది కదా, బింకానికి పోయావు, చిక్కుకున్నావు..అనుభవించు నా అంతరాత్మా తిడుతుంది…నొర్ముయ్ అలా ఏమీలేదు అంటూ దాన్ని కసిరి..ధైర్యం తెచ్చుకుని పాడటానికి రెడీ అయ్యాను.
” నువ్వు నువ్వు నువ్వే నువ్వు ” అంటూ గబ గబ పాడేశాను.
“ఏయ్ ఎంటా పాడటం నేను పాట పాడమాన్నాను పద్యం  చెప్పమనలేదు”.
” నాకిలా పాడటమే వచ్చు మేడమ్”  సిన్సియర్ గా చెప్పాను అని అనుకున్నాను..టింగరగా అనిపించిందని తన మొహం చూస్తే అర్థం అయింది.
అయ్యో ఆముక్త ఏమీ చేస్తున్నావే.. కొంచెం జాగ్రతగా మాట్లడవే అంతరాత్మా మళ్లీ హెచ్చరించింది . జాగ్రత్త పడెలోపే జరగాల్సింది జరిగిపోయింది.

” సరే పాటలో నువ్వు నువ్వు ఉన్న చోట్లలో కొవ్వు కొవ్వు అని పెట్టి పాడు” అంది ఆ అమ్మాయి తన ఉక్రోషం మాటల్లో చూపిస్తూ..
“”
“ఏంటి పాడమంటే మౌనంగా నిలబడ్దావు, పాట పాడకపోతే నిన్ను ఈ రోజంతా క్లాస్ కి పంపించాను ఇక్కడే నిలబెడతా, come on ఫాస్ట్ గా పాడేసి నీ క్లాస్ కి వెళ్లిపో”  నీకు అంతకన్నా వేరే ఆప్షన్ లేదని  నవ్వుతున్న కళ్ళతో చెప్పింది.
“”
“You Know Guys ఈ అమ్మాయికి చిరాకెక్కువ, ఏమైన అంటే చాలు చిరాకుగా మొహం పెడుతుంది.”
ఐతే నా అంతరాత్మా నిజమే చెప్పింది, నిన్నటి నా ప్రవర్తన కి ఫలితం అన్నమాట. ఒక్క నిమిషం నీరసం ఆవహించింది..  పెద్ద బరువేత్తుకున్న ఫీల్..  ఒక్క నిమిషం అలోచించాను ఈవాళ లేవగానే ఎవరి మొహం చూసాన అని… ఇంకెవరిది నాదే చూసుకుని ఉంటాను..లేవగానే అద్దం ముందు నిలబడి చూసుకోవడం  అలవాటె కదా అన్న విషయం జ్ఞప్తికి వచ్చి… ఆముక్త దొరికిపోయావే….
“ఏయ్ ” అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను….
“పాడమంటే ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయావు , ఫాస్ట్ గా పాడు మాకు క్లాస్ కి టైమ్ అవుతుంది”
ఆముక్త తప్పదు కళ్ళు మూసుకొని పాడేసెయ్యవే..ఈ లంపట౦ వదిలించుకొని క్లాస్ కి వెళ్లిపోవచ్చు…
“కొవ్వు కొవ్వు…..నీ వళ్ళంతా కొవ్వు” అని పాడుదామనుకున్న.
ఆముక్త శాంతి,ఇరుక్కుంటావు అని లోపలి నుండి హెచ్చరిక వినిపించడంతోమనసులో పాడేసుకుని ఆ అమ్మాయి అడిగిన విధంగా బయటకు పాడేశాను…
“అయిపోయిందా”
“ఎస్” అంటూ బుద్డిగా తలూపాను.
“సరే క్లాస్ కి పో” అంటూ వదిలేసింది.

హమ్మయ్య అనుకుంటూ క్లాస్ కి వెళ్ళాను, అక్కడ ఇంకో సీనియర్స్ బ్యాచ్ ఉంది… సర్ ని బయటకు పంపించి మరి తిష్ట వేశారు  క్లాస్ లో..అక్కడి నుండి పారిపోవాలని ఆ క్షణం గట్టిగా అనిపించింది, ఐనా సమధానపరుచుకుంటూ కూర్చున్నాను……

Posted in ఆలై పొంగెరా... | 4 Comments

అలై పొంగెరా పార్ట్-2

“I never really knew that she could dance like this
She makes a man want to speak Spanish,
Como se llama, bonita, mi casa, su casa
Shakira, Shakira

Oh baby when you talk like that
You make a woman go mad……”

నాకిష్టమైన పాటను హామ్ చేస్తూ క్లాస్ లో అడుగుపెట్టాను. అంత గొడవ గొడవ గా ఉంది. పరిచయాలతో, కేరింతలతో సందడిగా ఉంది.కొత్త స్నేహాలకు నాంది పడేది ఇక్కడే కదా అనుకుంటూ ఖాళీగా ఉన్న బెంచ్ లో కూర్చున్నాను.

“హాయ్ నేను సౌజన్య” అంటూ ప్రక్కనున్న అమ్మాయి చేయి చాచింది నవ్వుతూ.
“హాయ్ మై నేమ్ ఈజ్ ఆముక్త” అంటూ చేయి కలిపాను.
“మీ పేరు  చాలా బావుంది”
“థాంక్స్ “
“మీ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి”
“BCA,మరి మీది”
“BSc”
కాసేపట్లోనే బాగా క్లోస్ అయ్యాము ఎంతలా అంటే మీరు మీరు నుండి ఎప్పుడు ఏక వచనంలోకి దిగామో కూడా గుర్తు లేదు. సౌజన్య మంచి మాటకారి, ఏకబిగిన అరగంట గలగల మాట్లాడేయగలదు. రోజంతా పరిచయాలతోనే గడిచిపోయింది.

మరుసటి రోజు క్లాస్ కి లేట్ అయింది, అయ్యో టైమ్ అయిపోతుందే అని గబా గబా నడుస్తూ క్లాస్ వెళ్లేసరికి , మా క్లాస్ వాళ్ళంతా బిక్కమొహలు వేసుకుని బోర్డ్ వైపు చూస్తున్నారు. ఎవరో కొత్త వాళ్ళు ముందు నిలబడి , ఫ్రంట్ సీట్లలో కూర్చుని ఉన్నారు. వాళ్ళ  ముందు నిలుచోని మా క్లాస్‌మేట్ ఏదో చెప్తున్నాడు. అప్పుడు అర్థం అయింది నాకు వాళ్ళు  సీనియర్స్ అని,రాగ్ చేస్తున్నారని. మెల్లగా సీట్ లో వెళ్ళి కూర్చోన్నాను సొజన్య కి హాయ్ చెప్పి. ఒక్కొక్కరే లేచి స్టెజ్ పైకి వెళ్ళి ఇంట్రొడక్షన్ చెప్తున్నారు ,పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు.

సౌజన్య ని పిలిచారు స్టేజ్ పైకి
“మై నేమ్ ఇస్ సౌజన్య ఫ్రమ్ కరీంనగర్, హాబీస్ మ్యూసిక్ ,కుకింగ్”
“ఐతే పాట పాడు” ఆ బ్యాచ్ లో ఒకతను ఆర్డర్ వేసాడు.
“రామ రామ రామ నీలి మేఘ శ్యామ..”
అంతా నిశబ్దం ఆవరించుకుంది. నిజం చెప్పొద్ధూ పాట సూపర్ గా పాడుతుంది, పాడటం పూర్తవగానే క్లాస్ అంతా చప్పట్లు.
నా వంతు వచ్చింది.నేను లేచి స్టేజ్ పైకి వెళ్ళాను.
“దిస్ ఇస్ ఆముక్త ఫ్రమ్ కూకట్ పల్లి, హాబీస్ రీడింగ్ బుక్స్”
“ఏమీ బుక్స్ చదివవు నేమ్స్ చెప్పు” అడిగాడు ఆ బ్యాచ్ లో ఒక అబ్బాయి.
“ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుతాను”.
నాకు తెలుగు సాహిత్యం అంటే బాగా ఇష్టము,ఏ చిన్న పేపర్ ముక్క దొరికిన వదలకుండా చదువుతానని తినెప్పుడు కూడా చదువుతానని అమ్మ చాలా సార్లు కోప్పడింది.కావాలనే టెక్స్ట్ బుక్స్ అని చెప్పాను,అలా ఐతే వాళ్ళు నన్ను ఇంకా ఏమీ చేయమని అడగరని అనుకున్న.నా ఊహ తప్పని తెలియడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు.

” పాట పాడటం వచ్చా?”
“పోనీ డ్యాన్స్ చేయడం వచ్చా?”
“రాదు ” వస్తున్న చిరాకును నేర్పుగా కప్పిపేడుతూ చెప్పాను..ఆది ఆ అమ్మాయి గమనించనే గమనిచింది.
“రేపు పాట నేర్చుకుని వచ్చి పాడు. ఖడ్గం మూవీ లో నుండి “నువ్వు నువ్వు నువ్వే నువ్వే నువ్వు” పాట అంది.
“ఓకే” అంటూ తలూపాను హమ్మయ్య అనుకుంటూ.

అప్పుడు నాకు తెలీదు ఆ పాట పేరు తో ఆ అమ్మాయి నన్ను ఇంకా ఏడిపీంచడానికి ప్రయత్నిస్తుందని, నెక్స్ట్ జరిగే సంఘటనకు ఇది నాందని మరుసటి రోజు కాలేజ్ కి రాగానే అర్థం అయ్యింది.

Posted in ఆలై పొంగెరా... | 4 Comments

అలై పొంగెరా… పార్ట్-1

శ్రావణ మాసం ఆగస్ట్ నెల ,ఆడవాళ్లంత పూజలు వ్రతాలు చేసుకునే సమయం. సెలవులు అప్పుడే పూర్తయ్యయా అనుకుంటూ ఊసూరుమంటూ కాలేజ్ కి వెళ్తున్న స్టూడెంట్స్ (వీళ్ళంతా సీనియర్స్) ,జూనియర్స్ ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్న రోజులు.
నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్ ఆవరణమంత నందనవనంలా న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చిన స్టూడెంట్స్ తో నిండిపోయింది. ఒక గీత రచయిత రాసాడు
“ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు
ఏడనించో  గోరు వంకలు
కాలేజ్ క్యాంపస్ లోనే నాట్యం చేసేనే

కన్నేపిల్ళెల కొంటె నవ్వులూ
కుర్ర మనసుల కౌగిలింతలూ
కాలేజ్ కాంపౌండ్ అంటే కొడైకెనాలే “

చూస్తుంటే నిజమే అనిపిస్తుంది,ఇప్పుడు చూస్తే ఇంకేమి రాస్తాడో..

అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని కొంచెం తెలిసి తెలియక,ఏర్పడి ఏర్పడని వ్యక్తిత్వంతో, ప్రపంచాన్ని జయించేద్దామనే తపన   కనపడుతుంది ఆ కళ్ళలో. ఎన్నెనో చిట్టి గువ్వలు ,గోరు వంకలతో బృందావనం లా ఉంది.

నలందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్  సిటీ మద్యలో నారాయణగూడ లో ఉంటుంది,చాలా మంది కౌన్సిలింగ్ కి వెళ్ళిన వాళ్ళు కాలేజ్ లోకేషన్ చూసి సెలెక్ట్ చేసుకుంటారంటే నంమ్మశక్యం కాదు. ఇక్కడి నుండి సిటీ లో ని ఏ ప్లేస్ కి అయిన తొందరగా వెళ్ళవచ్చు.  ఈ కాలేజ్ కి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, కాలేజ్ ఆవరణంలో హాస్టల్ కూడా ఉంటుంది. పెద్ద ఎంట్రెన్స్ తో ఎంటర్ అవగానే విశాల ప్రాంగణం చెట్లతోనిండి ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తుంటుంది. కుడి ప్రక్కకు MCA కాలేజ్ ,సూటిగా వెళ్తే MBA కాలేజ్ వీటికి అర మైలు దూరంలో హాస్టల్ లొకేట్ చేయబడి ఉంటుంది.

కాలేజ్ జీవితం ప్రతి మనిషికి గుర్తుండిపోయే అందమైన అనుభవం. 20 ఏళ్ల వయసులోని ఈ అనుభవాలు 60 ఏళ్ల వయసులో నెమారేసుకోడానికి అనుభూతులను మిగిలుస్తాయి. రాగ్ చేసి స్నేహితులయ్యే సీనియర్స్,కాలేజ్ కొత్తలో బెరుకు చూపులు,చేయి చాచి స్నేహం కోరిన స్నేహితులు,క్యాంటీన్ లో కబుర్లు,న్యూ మూవీ రిలీజ్ రోజు కాలేజ్ బంకులు,క్లాస్ లో అల్లర్లు,లెక్చరర్ తో తిట్లు, క్లాస్ బోర్ కొడితే చెట్ల కింద నివాసాలు,సంవత్సరమంతా  మొహం చూడని లైబ్రరీ (పరీక్ష టైమ్ లో తప్ప),ఖాళీ జేబులు,1/2 టీ,బిర్యానీ పార్టీ లు, అమ్మాయిల ఓర చూపులు,తొలిప్రేమలు,నచ్చిన అమ్మాయిని మెప్పించడానికి పడే పాట్ల్,చిన్ని గొడవలు,ఆన్యూవల్ పార్టీ సొద,ఫ్రెషర్స్ పార్టీ రోజు ఆనందం ,టెన్షన్ పెట్టె సెమిస్టెర్ పరీక్షలు,స్నేహితులతో విహార యాత్రలు , సంతోషాన్ని, దుఖాన్ని రెండు తీసుకు వచ్చే ఫలితాలు, ఫలితాల పార్టీ లు, ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టె ఫేర్‌వెల్ పార్టీ ,ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగే రంగుల హరివిల్లు.

ఇవన్ని మరిచిపోగలమా, మళ్లీ వెనక్కి ఆ రోజులకీ వెళ్తే బావుండునని ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైన అనుకుంటాడు.
అడ్మిషన్ కౌంటర్ దగ్గర కొలాహాలంగా ఉంది. నుదుటి మీద పడిన ముంగురులను సవరించుకుంటూ చూశాను కౌంటర్ వైపు.
“పేరు”
“ఆముక్త”
“MCA అడ్మిషన్?”
“అవును”
“ఫిల్ దిస్ ఫామ్”
“సర్ పూర్తి చేశాను”అంటూ ఫిల్ చేసిన ఫాం ని ముందుకు చాచాను .
“ఇక్కడ సంతకం చెయమ్మ”
“ఓకె సర్”
“ఫార్‌మ్యాలిటీస్ అన్ని పూర్తి అయ్యాయి నువ్వికా క్లాస్ కి వెళ్ళవచ్చు.”
ఓకే అంటూ ముందుకు కదిలాను,

కళ్ళలో ప్రపంచాన్ని జయించాలనే తపన, ఆత్మవిశ్వాసం,కొంచెం భయం లక్ష్యాన్ని సాధించగలనో లెనొనని ..ఊహు ఏమీ కాదు సాదించాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదూ..నేను ఆముక్త, సగటు మద్య తరగతి అమ్మాయిని.  ఇది నా కథ.

Posted in ఆలై పొంగెరా... | 4 Comments